Mon Dec 23 2024 09:31:28 GMT+0000 (Coordinated Universal Time)
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
అప్పు ఇచ్చి అడిగినందుకు దారుణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను హత్యచేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
అప్పు ఇచ్చి అడిగినందుకు దారుణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను హత్యచేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీలోని శాంతినగర్ కు చెందిన ధారవత్ అశోక్‌కుమార్ ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అశోక్ కుమార్ బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ పెద్ద కుమారుడు. అశోక్‌కుమార్ కు భార్య, రెండు నెలల పాప ఉంది.
అప్పు ఇచ్చి.. అడిగినందుకు...
అయితే అశోక్ కుమార్ ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ కు చెదిన గుగులోత్ ప్రేమ్‌కుమార్ కు అప్పు ఇచ్చారు. ఎనభై వేలను రుణంగా ఇచ్చాడు. అప్పు తీసుకుని చాలా కాలం అవ్వడంతో తిరిగి చెల్లించాలని అశోక్ కుమార్ ప్రేమ్ కుమార్ పై వత్తిడి తెచ్చాడు. దీంతోఅశోక్పై కక్ష పెంచుకున్న ప్రేమ్‌కుమార్ మరో వ్యక్తి కలిసి అశోక్‌కుమార్ ను దారుణంగా హత్య చేశారు. డబ్బులు ఇస్తామని చెప్పడంతో ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుకు ఒంటరిగా వెళ్లిన అశోక్ కుమార్ ను స్థానిక పంచాయతీ కార్యాలయంలో గొంతుకోసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story