Mon Dec 23 2024 07:01:29 GMT+0000 (Coordinated Universal Time)
యువకుడి దారుణ హత్య.. శరీరాన్ని 12 ముక్కలుగా నరికి..
జిల్లాలోని సలేపలి ప్రాంతంలో రింకు మెహర్ (27) అనే యువకుడు తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి అద్దె ఇంటిలో..
ఓ యువకుడిని హతమార్చి.. అతని శరీరాన్ని 12 ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో కుక్కి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ దారుణ హత్యోదంతం ఒడిశాలోని బోలింగర్ జిల్లాలో బుధవారం (మే 17) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని సలేపలి ప్రాంతంలో రింకు మెహర్ (27) అనే యువకుడు తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న అతను.. 20 రోజుల క్రితం తల్లిదండ్రులను విచక్షణా రహితంగా కొట్టి బుర్లా మెడికల్ సెంటర్ లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశాడు. ప్రస్తుతం తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది.
ఆ ఘటన జరిగిన కొద్దిరోజులకు తల్లిదండ్రులను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన రింకు తమ్ముడు అదృశ్యమయ్యాడు. బుదవారం రింకు ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటి తలుపులు లోపలినుంచి గొళ్లెం పెట్టి ఉండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా..7 పాలిథిన్ బ్యాగుల్లో రింకు శరీర భాగాలు కనిపించాయి. హత్య తాలూకు సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకే నిందితులు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. రింకుని పక్కా పథకం ప్రకారం హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. మృతుడి తమ్ముడు, తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- odisha crime
Next Story