Mon Dec 23 2024 09:52:24 GMT+0000 (Coordinated Universal Time)
సరిహద్దుల వద్ద ఆకుపచ్చ సంచితో పాక్ డ్రోన్ కలకలం..
పంజాబ్ - ఫిరోజ్ పూర్ సెక్టార్లోని సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్ కు చెందిన ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది.
పంజాబ్ : పాకిస్థాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. గతంలో పలుమార్లు సరిహద్దుల్లో పాక్ డ్రోన్లను ఎగురవేయగా.. ఇండియన్ ఆర్మీ వాటిని కూల్చివేసింది. తాజాగా మరోసారి అదే బుద్ధిని చూపించింది పాక్. పంజాబ్ - ఫిరోజ్ పూర్ సెక్టార్లోని సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్ కు చెందిన ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దానిని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే డ్రోన్ ను కూల్చి వేశారు.
Also Read : సింగరేణి బొగ్గుగనుల్లో ప్రమాదం.. నలుగురు మృతి
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆ డ్రోన్ ను ఒక ఆకుపచ్చ సంచి ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది.. కూల్చివేత అనంతరం దానిని పరిశీలించగా.. అందులో నిషేధిత వస్తువులు లభ్యమైనట్లు బీఎస్ఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు. ఆ చిన్న సంచిలో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, నలుపు రంగుతో కూడిన మరో ప్యాకెట్ కూడా ఉందని తెలిపారు. వాటిలో ఏం ఉన్నాయన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు.
Next Story