Thu Dec 26 2024 01:46:54 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో బీఎస్పీ చీఫ్ దారుణ హత్య
తమిళనాడులో బీఎస్పీ అధ్యక్షుడుచీఫ్ కె. ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు.
తమిళనాడులో బీఎస్పీ అధ్యక్షుడుచీఫ్ కె. ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. నలభై ఏడేళ్లున్న ఆర్మ్ స్ట్రాంగ్ తమిళనాడు బీఎస్పీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. చెన్నై పెరంబూరు ప్రాంతంలో నిన్న రాత్రి ఈ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి ఆర్మ్ స్ట్రాంగ్ పై కత్తులతో దాడికి దిగారు. ఆయన వెంట ఇద్దరిని కూడా గాయపర్చారు. అయితే అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆర్మ్ స్ట్రాంగ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఫుడ్ డెలివరీ బాయ్స్ వేషంలో...
ఫుడ్ డెలివరీ బాయ్స్ వేషంలో వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారు.అయితే ఈ హత్య చేసిన వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో పాల్గొన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ దారుణ హత్యను ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story