Mon Dec 23 2024 07:56:32 GMT+0000 (Coordinated Universal Time)
నడి కుడి రైల్వే స్టేషన్ లో దోపిడీ
నడికుడి రైల్వే స్టేషన్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. 89 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.
నడికుడి రైల్వే స్టేషన్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. 89 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైల్వే స్టేషన్ కు వచ్చారు. వారు చెన్నై వెళ్లేందుకు రెండో నెంబరు ప్లాట్ ఫారం పై వేచి చూస్తున్నారు. ఎస్ 6 బోగీ ఆగే చోట ఈ ముగ్గురు వెయిట్ చేస్తున్నారు.
పోలీసులు రమ్మంటున్నారంటూ....
ఇది గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులు రమ్మంటున్నారంటూ వారిని బయటకు తీసుకెళ్లారు. ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి చితక బాదారు. వారి వద్ద ఉన్న 89 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వ్యాపారం కోసం ఈ నగదును చెన్నై తీసుకెళుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story