Mon Dec 23 2024 14:00:18 GMT+0000 (Coordinated Universal Time)
లోయలో పడిన ఏపీ ప్రయాణికుల బస్సు
ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళుతున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది
ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళుతున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళుతున్న బస్సు పతనంతిట్ట వద్ద లోయలో పడిందని అధికారులు తెలిపారు.
ముగ్గురి పరిస్థితి విషమం...
ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి బస్సు లోయలో పడినట్లు తెలిసింది. బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది? అన్న సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story