Mon Dec 23 2024 13:50:33 GMT+0000 (Coordinated Universal Time)
స్టీరింగ్ పట్టేయడంతోనే...?
స్టీరింగ్ పట్టేయడంతోనే బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు
స్టీరింగ్ పట్టేయడంతోనే బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. శబరిమల వెళుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏలూరు వాసులు గాయపడ్డారు. మొత్తం 18 మందికి గాయలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఏలూరు వాసులు...
పత్తనందిట్ట జిల్లా లాహల్యాంప్ బోటు ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. బస్సు ఘాటు రోడ్డులో ప్రయాణిస్తుండగా స్టీరింగ్ పట్టేయడంతో బోల్లా పడింది. బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. వీరంతా ఏలూరు జిల్లా మాదేపల్లి ప్రాంత వాసులుగా గుర్తించారు. అయ్యప్ప దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story