Fri Dec 20 2024 08:52:19 GMT+0000 (Coordinated Universal Time)
వంతెనపై నుండి నదిలో పడ్డ బస్సు
వంతెన పై నుండి బస్సు నదిలో పడింది. శనివారం రాత్రి జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో
వంతెన పై నుండి బస్సు నదిలో పడింది. శనివారం రాత్రి జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో వంతెనపై నుండి బస్సు నదిలో పడటంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.. 24 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిలో కొంత మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. బస్సు రాంచీ నుంచి గిరిదిహ్‌కి వెళ్తుండగా రాత్రి 8.40 గంటల ప్రాంతంలో డుమ్రీ రోడ్డు వద్ద బస్సు బరాకర్ నదిలో పడటంతో ప్రమాదం జరిగిందని గిరిదిహ్ సబ్-డివిజనల్ పోలీసు అధికారి అనిల్ కుమార్ తెలిపారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. గిరిదిహ్ సివిల్ సర్జన్, డాక్టర్ ఎస్పీ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారని, 24 మంది గాయపడ్డారని అన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు.
గిరిదిహ్-దుమ్రి రహదారిలో బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రెయిల్స్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత 50 మీటర్ల లోతున నదిలో పడింది. ఘటనా స్థలికి గిరిద్ ఎమ్మెల్యే సుదివ్య కుమార్, డీసీ నామన ప్రియేష్ లక్రా చేరుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.బస్సు నదిలో పడిన విషయం తెలియగానే అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రయాణికులు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లుగా సమాచారం.
Next Story