Mon Dec 23 2024 06:30:11 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం.. 5 బైక్ లు దగ్ధం
టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లంబాడీపేట నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతిరోజూ ..
బెజవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. నగర శివారు ప్రాంతమైన లంబాడిపేటలో బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఐదు బైక్ లను తగలబెట్టారు. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లంబాడీపేట నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతిరోజూ కొందరు యువకులు గంజాయి సేవించేందుకు వస్తారని స్థానికులు చెప్తున్నారు. ఆ మత్తలో వీరంగం చేసి.. అల్లర్లకు పాల్పడుతుంటారు.
గంజాయి బ్యాచ్ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారన్న అనుమానంతో.. కొందరు దుండగులు బైక్ లను తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story