Mon Dec 23 2024 08:59:35 GMT+0000 (Coordinated Universal Time)
రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు, కారు దగ్ధం
కారు సడన్ బ్రేక్ వేసి, ఆగడంతో.. వెనుక వస్తున్న కారు ఆ కారును ఢీ కొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయి.
విశాఖపట్నం : జాతీయ రహదారిపై వెళ్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో.. ఓ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉద్ధండపురం హైవేపై జరిగింది. ఉద్ధండపురం జాతీయరహదారిపై వెళ్తున్న కారుకి కుక్క అడ్డు రావడంతో.. దానిని తప్పించేందుకు సడన్ బ్రేక్ వేశారు డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి.
కారు సడన్ బ్రేక్ వేసి, ఆగడంతో.. వెనుక వస్తున్న కారు ఆ కారును ఢీ కొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయి. వెనుక ఉన్న కారులో ఇద్దరు చిన్నారులతో పాటు మరో నలుగురు ఉండగా.. వారందరికీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కానీ.. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
Next Story