Mon Dec 23 2024 17:08:01 GMT+0000 (Coordinated Universal Time)
అదుపుతప్పి లోయలో పడిన కారు.. ఒకరు మృతి
షిఫ్ట్ డిజైర్ కారు అన్నవరం వద్ద నేషనల్ హైవేపై వెళ్తుండగా.. అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో..
అన్నవరం : రాజమండ్రి నుంచి విశాఖకు వస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. AP 35K 5090 నంబరుతో రిజిస్టర్ అయిన షిఫ్ట్ డిజైర్ కారు అన్నవరం వద్ద నేషనల్ హైవేపై వెళ్తుండగా.. అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో డ్రైవింగ్ సీటులో ఉన్న భర్త మృతి చెందగా.. భార్య పద్మావతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించగా.. పద్మావతిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story