Mon Dec 23 2024 04:07:21 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దాపురంలో కారు బీభత్సం
కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాల య్యాయి
కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నాలుగు ద్విచక్రవాహనాలు, ఒక ఆటో కారు ఢీకొట్టడంతో ధ్వంసమయ్యాయి. అయితే కారు ప్రమాదంపై పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. అనుభవం లేకుండా ఒక వ్యక్తి కారును నడపటం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.
అనుభవం లేని వ్యక్తి....
పెద్దాపురంలోని దర్గా సెంటర్ నుంచి స్టేట్ బ్యాంక్ కు వెళ్లే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే పోలీసులు వచ్చి కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు తక్కువ సంఖ్యలో జనం ఉండటంతో పెద్ద ముప్పు తప్పిందంటున్నారు.
Next Story