Mon Dec 23 2024 14:57:32 GMT+0000 (Coordinated Universal Time)
Accident : కారుతో మోటారు సైకిల్ ను ఢీకొట్టడంతో ఎగిరి వాహనంపై పడి 18.కిమీల ప్రయాణం
వేగంగా ఒక కారు వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు కారు టాప్ పై పడిపోయాడు
వేగంగా ఒక కారు వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు కారు టాప్ పై పడిపోయాడు. కానీ కారు డ్రైవర్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా పద్దెనిమిది కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వై కొత్త పల్లి వద్ద ఎర్రిస్వామి ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అనంతపురంలో ఉంటున్నారు. వ్యక్తిగత పనిపై సిద్దరాంపురం వెళ్లి వస్తుండగా నిన్న రాత్రి వై. కొత్తపల్లి సమీపంలోకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది.
మద్యం మత్తులో....
దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారు టాప్ పైన పడిపోయారు. గమనించని డ్రైవర్ వేగంగా కళ్యాణదుర్గం వైపు వెళుతున్నాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని వాహనదారులు గమనించి, అడ్డంగా వెళ్లి ఆపి ప్రశ్నించడంతో డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story