Mon Dec 23 2024 03:45:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో విషాదం.. ప్రమాదంలో నలుగురు మృతి
అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద ఆగి..
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఏదొక ప్రాంతంలో రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరికల సూచనలతో బోర్డులు ఏర్పాటు చేసినా.. రోడ్డుప్రమాదాలు తగ్గడం లేదు. తాజాగా ఏపీలో మరో రోడ్డుప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం పీలేరు సమీపంలోని ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
కర్నూలు జిల్లా నంద్యాల నుంచి తిరువన్నామలై గిరి ప్రదక్షిణకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కర్నూలుకు చెందిన ప్రతాపరెడ్డి, శివమ్మ, విమల, మరొకరు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కల్లూరు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story