Mon Dec 23 2024 08:56:30 GMT+0000 (Coordinated Universal Time)
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
స్థానికుల సహాయంతో మృతదేహాలను, కారును చెరువులో నుంచి వెలికి తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా..
మదనపల్లె : ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులో 150వ మైలురాయి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. కల్వర్టును ఢీ కొట్టింది. వెంటనే పక్కనున్న చెరువులో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. వారంతా అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో మృతదేహాలను, కారును చెరువులో నుంచి వెలికి తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన దంపతులు గంగిరెడ్డి, మధులత, వారి కుమార్తె కుషితారెడ్డి, కుమారుడు దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story