Mon Dec 23 2024 11:21:24 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
అయ్యన్నపాత్రుడు వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ1 జగన్ రెడ్డి గారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే నేనేమైనా..
అమరావతి : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైంది. 304, 305, 188, 204 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జాతర పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పోలీసులపై రెచ్చిపోయారు. కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని పోలీసులు కోరడంతో రెచ్చిపోయారు అయ్యన్న. ఎస్సైని తోసేయడంతోపాటు, అసభ్యకరంగా మాట్లాడారు. మరో రెండేళ్లు అంటూ పోలీసులకు హెచ్చరికలు జారీచేశారు.
మరో వైపు అయ్యన్నపాత్రుడు వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ1 జగన్ రెడ్డి గారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ... ఏ2 విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. జాబ్ మేళా అంటే ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం లాంటి రంగాల్లో ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నానని, మీరు ఇచ్చేది సెక్యూరిటీ గార్డ్, హెల్పర్, సేల్స్ పోస్ట్లని ఇప్పుడు తెలిసిందన్నారు. వీసా రెడ్డి సీమ ప్రాంత బిడ్డలకు నాలుగు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని ఆశపడ్డామన్నారు. ఫైనల్గా తేలింది ఏంటంటే....రెజ్యుమ్లు ఇచ్చి వెళ్ళమన్నారట అని విమర్శలు చేశారు.
Next Story