Thu Dec 26 2024 04:13:07 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో డ్రగ్స్ కలకలం
విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ ను తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు
విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ ను తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. నాలుగు లక్షల విలువైన 71 గ్రాముల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరు నుంచి విశాఖకు...
బెంగళూరు నుంచి విశాఖకు వచ్చిన నలుగురు యువకులు ఈ డ్రగ్స్ ను విక్రయిస్తుండగా పోలీసులు వల వేసి పట్టుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల కోసమే డ్రగ్స్ ను తీసుకు వచ్చినట్లు వారు పోలీసుల ఎదుట అంగీకరించారు.
Next Story