Thu Apr 10 2025 10:23:38 GMT+0000 (Coordinated Universal Time)
బీఎండబ్ల్యూ కారు అద్దాలు పగులగొట్టి
కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలు ఓ దొంగతనం

కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలు ఓ దొంగతనం జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి అందులోని రూ.13 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటనపై సర్జాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత శుక్రవారం ఈ దొంగతనం జరగగా.. ఆ దొంగతనం మొత్తం నిఘా కెమెరాకు చిక్కింది.
వీడియో ఫుటేజ్‌లో ఒక వ్యక్తి BMW X5 కారు దగ్గరగా తచ్చాడుతూ ఉండగా.. ఇంతలో మరో వ్యక్తి మాస్కు వేసుకుని బైక్ పై వచ్చాడు. ఇంతలో కారు దగ్గర ఉన్న వ్యక్తి అద్దాలను పగులగొట్టాడు. అతని సహచరుడు మోటార్‌సైకిల్‌పై వేచి ఉన్నాడు. కారులోకి దూకి అందులో ఉన్న డబ్బుతో అక్కడి నుంచి పరారయ్యారు. కారు బెంగళూరులోని అనేకల్ తాలూకా లోని బాబుకు చెందినది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
Next Story