Mon Dec 23 2024 06:12:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆమె అరుపులు వినగానే పరిగెత్తుకుని వచ్చారు.. తీరా..!
ఫరా అంజుమ్‌ను కొందరు మహిళలు కర్రలతో దారుణంగా కొట్టినట్లు వీడియోలో రికార్డు అయింది
ఓ మహిళ గట్టిగా అరుస్తూ ఉండగా అందరూ పరిగెత్తుకుని వచ్చారు. ఓ మహిళను మరో మహిళ కొడుతూ ఉండడం చూశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ మహిళతో ఆమె భర్త తిరుగుతున్నాడని తెలుసుకున్న మొదటి భార్య.. మరికొందరు మహిళలతో కలిసి ఆమెను దారుణంగా కొట్టారు. ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్న వైద్యుడు ఖాసీం అలీకి చెందిన క్లినిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అతని మొదటి భార్య ఆయేషా.. కొందరు మహిళల బృందంతో క్లినిక్‌కి వచ్చి, రెండవ భార్య ఫరా అంజుమ్‌ను చితకబాదింది. ఈ ఘటన క్లినిక్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది.
ఫరా అంజుమ్‌ను కొందరు మహిళలు కర్రలతో దారుణంగా కొట్టినట్లు వీడియోలో రికార్డు అయింది. స్థానికులు ఆమె అరుపులు విని అక్కడకు వచ్చారు. వారు ఫరాను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఫరా అంజుమ్ సీసీటీవీ క్లిప్‌తో స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త ఖాసీం అలీ, అతని మొదటి భార్య అయేషా, ఆమె స్నేహితులు ఫర్జానా, గుల్షన్, నోమన, సైమా, సిమ్రాన్, నవీసాలపై ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Next Story