Sat Dec 21 2024 15:46:04 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో సీబీఐ మరో ఛార్జిషీటు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పై ఛార్జిషీటు దాఖలు చేసింది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పై ఛార్జిషీటు దాఖలు చేసింది. పులివెందుల కోర్టులో ఈ ఛార్జిషీటు ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదో నిందితుడిగా చేర్చారు. దీంతో మొత్తం ఐదుగురిపై వివేకాందరెడ్డి హత్య కేసులో సీబీఐ కేసు నమోదు చేసినట్లయింది.
ఇప్పటికే కొందరిపై....
ఇప్పటికే ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలపై కేసు నమోదయింది. ఇందులో దస్తగిరి అప్రూవర్ గా మారారు. 2019 మార్చి నెలలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆర్థిక లావాదేవీల కారణంగానే వివేకాహత్య జరిగినట్లు సీబీఐ అధికారులు తమ విచారణలో కనుగొన్నారు.
Next Story