Mon Dec 23 2024 02:55:55 GMT+0000 (Coordinated Universal Time)
Sridevi : శ్రీదేవి మరణంపై.. ఫేక్ డాక్యుమెంట్లు.. సీబీఐ అధికారులు?
సినీనటి శ్రీదేవి మరణంపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన దీప్తిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
సినీనటి శ్రీదేవి మరణంపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన దీప్తిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. భువనేశ్వర్ కు చెందిన దీప్తి పిన్నిటిపై చార్జిషీటు దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది. ప్రముఖ నటి శ్రీదేవి ఒక ఫంక్షన్ కు వెళ్లి ఒక హోటల్ లో బాత్ టబ్ లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మరణంపై అనేక సార్లు దీప్తి సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు.
న్యాయవాది ఫిర్యాదుతో...
దీప్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత ప్రభుత్వం అనేక విషయాలు దాచి పెట్టిందని కూడా అన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను చూపించడంతో అవి వైరల్ గా మారాయి. అవి నకిలీపత్రాలని ఒక న్యాయవాది సీబీఐకి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి దీప్తిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా తెలిపింది.
Next Story