Sun Jan 12 2025 13:09:00 GMT+0000 (Coordinated Universal Time)
అసలు నిందితులు దొరుకుతారా?
ఆయేషా మీరా కేసులో మరోసారి సీబీఐ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్ సీబీఐ కేంద్రంగా దర్యాప్తు సాగుతుంది
ఆయేషా మీరా కేసులో మరోసారి సీబీఐ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్ సీబీఐ కేంద్రంగా దర్యాప్తు సాగుతుంది. ఈ కేసులో సత్యంబాబును నిర్దోషిగా కోర్టు తేల్చడంతో అసలు నిందితులను తేల్చేందుకు సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిన్న అయేషా మీరా హాస్టల్ వార్డెన్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
హత్య జరిగి ఇన్నేళ్లయినా...
ఆయేషా మీరా హత్య జరిగి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటి వరకూ హత్యకు పాల్పడిన అసలు నిందితులు ఎవరో తేలలేదు. అనేక అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ సాక్ష్యాలను చెరిపేయడం ద్వారా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ మరోసారి విచారణ చేపట్టింది.
- Tags
- ayesha meera
- cbi
Next Story