Mon Dec 23 2024 03:02:35 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : విశాఖలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
విశాఖ షిప్ యార్డులో భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నానేజ
విశాఖ షిప్ యార్డులో భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంటర్ పోల్ సాయంతో ఈ డ్రగ్స్ ను సీబీఐ దాడులు చేసి మరీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటి సారి అని అధికారులు అంటున్నారు. వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ ను నింపి విశాఖ పోర్టుకు కన్సింగి కంపెనీ తీసుకు వచ్చినట్లు సీబీఐ అధికారులు ప్రాధమికంగా గుర్తించారు.
బ్రెజిల్ నుంచి విశాఖకు...
ఇంటర్ పోల్ నుంచి వచ్చిన సమాచారం తో విశాఖ షిప్ యార్డులో సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ డ్రగ్స్ ను బ్రెజిల్ నుంచి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు? ఈ డ్రగ్స్ ను ఎక్కడకు తీసుకెళ్ళడానికి విశాఖ పోర్టుకు తీసుకు వచ్చారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ వేల కోట్ల రూపాయల విలువ ఉ:టుందని తెలిసింది. ఆపరేషన్ గరుడ పేరుతో ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సీీబీఐతో పాటు కస్టమ్స్ అధికారులు కూడా పాల్గొన్నారు.
Next Story