Mon Dec 23 2024 04:22:22 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాలలో కోట్ల విలువైన సెల్ఫోన్ల దొంగతనం
నంద్యాలలో కర్నూల్ జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఓబులాపురం మిట్ట సమీపంలో
నంద్యాలలో కర్నూల్ జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఓబులాపురం మిట్ట సమీపంలో దాదాపు రూ.1.3కోట్ల విలువైన సెల్ఫోన్ కంటైనర్ను దొంగతనం చేశారు. ఈ దొంగతనాన్ని ఇద్దరు డ్రైవర్లు చోరీ చేశారు. సెప్టెంబర్ 11 ఈ దొంగతనం చోటు చేసుకుంది. సెల్ఫోన్ల లోడుతో హరియాణా నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ను రోడ్డు పక్కనే ఆపిన డ్రైవర్లు అందులోని సెల్ఫోన్లను మరొక వాహనంలోకి మార్చేశారు. కంటైనర్ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. నాగాలాండ్కు చెందిన కంటైనర్ యజమాని డోన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న డోన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ లోని మధురానగర్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇల్లు కొనుగోలు చేసేందుకు దాచుకున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ నెల 12న జరిగిన ఈ చోరీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ కు చెందిన వాస్తు నిపుణుడు వీఎల్ఎన్ చౌదరి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. యజమాని ఖాళీ చేయాలని చెప్పడంతో ఇల్లు కొనుక్కుని అందులోకి మారాలని ప్రయత్నిస్తున్నారు. బ్యాంకులో దాచుకున్న సొమ్మును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చౌదరి అర్ధరాత్రి ప్రాంతంలో తిరిగి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెడుతూనే చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో దాచిన రూ.3.93 కోట్ల నగదుతో పాటు 450 గ్రాముల బంగారు కడ్డీలు, మూడు ల్యాప్ టాప్ లు, పలు విలువైన పత్రాలు దొంగలు ఎత్తుకెళ్లారు.
Next Story