Sat Jan 11 2025 17:50:45 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాదీలూ... అలర్ట్
ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ఆరుచోట్ల చైన్స్నాచర్లు మహిళల మెడలో బంగారు గొలుసులను దొంగిలించుకుపోయారు
బంగారం ధరలు పెరుగుతున్నాయి. దాని విలువ కూడా మార్కెట్ లో ఎక్కువగా ఉంది. ఆభరణాలను మాయం చేయడం సులువుగా మారింది. వాటిని కాజేయడం, అమ్మడం తేలిక కావడంతో చైన్ స్నాచర్లు ఎక్కువయ్యారు. హైదరాబాద్ లో ఒక్కరోజులో జరిగిన ఘటనలు నగరవాసులను దడ పుట్టిస్తున్నాయి.
ఢిల్లీ ముఠా...
ఈరోజు ఉదయం ఆరుచోట్ల చైన్స్నాచర్లు మహిళల మెడలో బంగారు గొలుసులను దొంగిలించుకుపోయారు. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని టార్గెట్ గా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. ఉప్పల్ లో రెండు చోట్ల, నాచారంలో ఈ వరస చైన్ స్నాచింగ్ లు జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రవీంద్రనగర్, చిలకలగూడ, రామగోపాల్ పేటలోనూ చైన్ స్నాచర్లు దొంగిలించుకుపోయారు. ఢిల్లీకి చెందిన ముఠా ఒకటి నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
Next Story