Mon Dec 23 2024 01:03:29 GMT+0000 (Coordinated Universal Time)
దొరికిపోయిన చందన
జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసుకు సంబంధించి.. ఒంగోలులో దీప్తి సోదరి చందన
జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసుకు సంబంధించి.. ఒంగోలులో దీప్తి సోదరి చందన, ఆమె స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీప్తి అనుమానాస్పద మృతి నేపథ్యంలో చందనపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. పాస్పోర్ట్ తీసుకుని విదేశాలకు పారిపోతుందని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీటెక్ చదివే సమయంలో పరిచమైన స్నేహితుడితో చందన ప్రేమాయణం సాగిస్తున్నట్లు, అతడితోనే ఆమె పరారయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లగా.. ఆ రాత్రి అక్కాచెల్లి దీప్తి, చందన మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దీప్తి శవమైంది, చందన కనపించకుండా పోయింది. తాను ప్రేమించే యువకుడితోనే చందన వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మూడు రోజుల క్రితం ఇంట్లోనే దీప్తి, ఆమె చెల్లెలు చందన కలిసి రాత్రి ఇంట్లో మద్యం తాగారు. దీప్తి మత్తులో సోఫాలోనే పడుకుండిపోయింది. ఎంత లేపినా లేవలేదు. దీంతో చందన.. తన ప్రియున్ని తీసుకుని వెళ్లిపోయింది. చందన తన తమ్మునికి వాయిస్ రికార్డు పంపింది. చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్నర బంగారు నగలు, పాస్పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. చందన ప్రియుడు హైదరాబాదీగా పోలీసులు గుర్తించారు. చందన ఫోన్కాల్ డేటా ఆధారంగా అతని వివరాలు కూడా సేకరించారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇద్దరి సెల్ఫోన్లు ఆఫ్లో ఉండటంతో ఆచూకీ కనుక్కోవటం కొంచెం కష్టమైంది. కానీ ఎట్టకేలకు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.
Next Story