Wed Jan 15 2025 06:04:07 GMT+0000 (Coordinated Universal Time)
తడిచేతులతో ఛార్జింగ్ పెడుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదం
ఎలక్టికల్ వస్తువులను చేతులతో ముట్టుకునే ముందు
ఎలక్టికల్ వస్తువులను చేతులతో ముట్టుకునే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన ప్రాణాలకే ప్రమాదం. ఓ చిన్నారి ఛార్జింగ్ లో ఉన్న మొబైల్ ఫోన్ ను ముట్టుకోవడంతో ఆమె ప్రాణాలు పోయాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ -సుధారాణి దంపతుల 8 సంవత్సరాల పాప అంజలి కార్తీక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలింది. దీంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ బాలిక తన తండ్రి సెల్ ఫోన్ కి తడి చేతులతో ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4 వ తరగతి చదువుతుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story