Mon Dec 23 2024 10:34:19 GMT+0000 (Coordinated Universal Time)
వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకం
వెంకటగిరిలోని కాలేజి మిట్ట ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం చోటు చేసుకుంది. ప్రమోన్మాది యువతిపై కత్తితో దాడికి దిగాడు. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటగిరిలోని కాలేజి మిట్ట ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం విద్యార్థినిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థిని గొంతుకోసి.....
చెంచుకృష్ణ గత కొంతకాలంగా తనను ప్రేమించాలని విద్యార్థినిపై వత్తిడి తెస్తున్నాడు. అయితే విద్యార్థిని ప్రేమకు అంగీకరించకపోవడంతో కత్తితో దాడికి దిగారు. ప్రేమోన్మాది చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
Next Story