Mon Dec 23 2024 06:28:25 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మిస్ చెన్నైని 40 రోజులు గదిలో బంధించిన ఎస్సై.. ఆపై అత్యాచారం
చెన్నైలోని పళ్లికరణకు చెందిన యువతి.. మిస్ చెన్నై పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు విదేశాల్లో నివాసం..
అందంగా ఉన్న యువతి. ఎలాగైనా ఆ యువతిని లొంగదీసుకోవాలని ప్లాన్ చేశాడు పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ. 40 రోజుల పాటు ఆమెను గదిలో బంధించి, శారీరకంగా వాడుకున్నాడు. ఆమె నుంచి ఆస్తిపత్రాలు, గోల్డ్ లాక్కున్నాడు. ఇవన్నీ భరించలేని ఆ యువతి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. విషయం వెలుగుచూసింది. ఈ ఉదంతం తమిళనాడులో చోటుచేసుకుంది.
చెన్నైలోని పళ్లికరణకు చెందిన యువతి.. మిస్ చెన్నై పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు విదేశాల్లో నివాసం ఉంటున్నారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఆమెకొక ప్లాట్ ఉంది. అక్కడే ఉంటూ.. సామాజిక సేవ చేస్తుంది. ఆ స్థలంలో మంచి ఇల్లు కట్టిస్తానని చెప్పి బిల్డర్ మోసం చేయడంతో.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడే ఆండ్రూ కాడ్వెల్ అనే స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్ స్పెక్టర్ పరిచయం అయ్యాడు. అతనికి ఫిర్యాదు చేయగా.. కేసు విచారణ నిమిత్తం ఆమెను పలుమార్లు కలిశాడు. కొన్నాళ్లకు విదేశాల్లో ఉన్న తల్లిదండ్రులు అనారోగ్యానికి గురై చనిపోయారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో బాధిత యువతి మానసికంగా కుంగిపోయింది. తన బాధను కాడ్వెల్ తో పంచుకుంది. వ్యక్తిగత విషయాలు, సమస్యలను కాడ్వెల్ కు చెప్పింది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన కాడ్వెల్.. ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ చేశాడు.
Also Read : పూల పరిమళాన్ని మిగిల్చి...లత వెళ్లిపోయింది
నిదానందా యువతికి దగ్గరై.. తన ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని, అవి దూరమైతే అంతా బాగుంటుందని నమ్మబలికాడు. దుష్టశక్తులను తొలగించే వంకతో ఒక పాస్టర్, అతని తల్లి, సోదరిని ఆమె ఇంటికి తీసుకొచ్చాడు. వారంతా కలిసి నిత్యం పూజలు చేస్తూ.. క్రమంలో ఇంట్లో పనిచేసేవారిని మాన్పించేశారు. ప్రత్యేక పూజల పేరు చెప్పి 40 రోజులు గదిలో బంధించారు. మత్తు కలిపిన పానీయాలు ఇచ్చి బలహీన పరిచారు. ఎస్సై కాడ్వెల్ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ.. ఆమెను లొంగదీసుకున్నాడు. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేయగా అతని తల్లికి బాధిత యువతి విషయం తెలిపింది. తనకొడుకు పెళ్లి చేసుకుంటాడని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె వద్దనున్న బంగారం, విలువైన ఆస్తిపత్రాలను కాడ్వెల్ లాక్కున్నాడు. తిరిగి తన ఆస్తిపత్రాలను అడగ్గా.. ఆమెపై ఎదురుదాడి చేశాడు. దీంతో బాధిత యువతి పళ్లికరణై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జరిగిందంతా పోలీసులకు తెలుపగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story