Sun Mar 30 2025 12:57:41 GMT+0000 (Coordinated Universal Time)
భార్య బంగారం దొంగిలించి.. 22 ఏళ్ల ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చిన 40 ఏళ్ల భర్త
తన బంగారు ఆభరణాలను తిరిగి తీసుకునేందుకు ఇంటికి తిరిగి వచ్చింది.

బంగారం దొంగతనం ఘటనలో ఊహించని ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తన ఇంట్లో పెళ్ళాం బంగారు ఆభరణాలను దొంగిలించి, 22 ఏళ్ల యువతికి బహుమతిగా ఇచ్చిన 40 ఏళ్ల వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు శేఖర్ తన సోదరుడు రాజేష్ కుటుంబం, అతని తల్లితో కలిసి చెన్నైలోని పూనమల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు. మనస్పర్థలు రావడంతో శేఖర్ భార్య రెండేళ్ల క్రితం అతడిని వదిలి వెళ్లిపోయింది.
ఆమె తన బంగారు ఆభరణాలను తిరిగి తీసుకునేందుకు ఇంటికి తిరిగి వచ్చింది. అయితే అవి కనిపించకపోవడంతో షాక్ అయ్యింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో శేఖర్ తన భార్య తెచ్చిన 300 సవర్ల బంగారు ఆభరణాలు, అతని తల్లికి చెందిన 200 సవర్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతను వాటిని 22 ఏళ్ల స్వాతి అనే మహిళకు బహుమతిగా ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. ఆమెతో అతడికి ఉన్న అనుబంధం కారణంగా ఎంతో ఖర్చు చేసినట్లు కూడా పోలీసులు తెలుసుకున్నారు. శేఖర్ స్వాతికి కారు కూడా కొన్నాడని తెలుస్తోంది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story