Sun Dec 22 2024 09:17:23 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ నేత దారుణ హత్య.. పెళ్ళికి వెళ్లి వస్తుండగా!!
భారతీయ జనతా పార్టీ నేతను అతి దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్
భారతీయ జనతా పార్టీ నేతను అతి దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బీజేపీ నాయకుడిని శుక్రవారం నరికి చంపినట్లు అధికారులు తెలిపారు. అతడిని చంపింది మావోయిస్టులని అనుమానిస్తూ ఉన్నారు. జన్పద్ పంచాయతీకి చెందిన బీజేపీ సభ్యుడు తిరుపతి కట్ల, జిల్లాలోని తోయనార్ గ్రామంలో వివాహానికి హాజరై వస్తున్న సమయంలో హత్యకు గురైనట్లు బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) జితేంద్ర యాదవ్ తెలిపారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి వేడుకకు వెళ్లిన అతడిని పదునైన ఆయుధంతో పొడిచి చంపారని యాదవ్ తెలిపారు. తీవ్రగాయాలపాలైన జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు.
హంతకుల గుర్తింపు కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గత ఏడాది కాలంలో ఏడుగురు బీజేపీ నేతలు హతమయ్యారు. గత ఏడాది నవంబర్లో బీజేపీ నారాయణపూర్ జిల్లా యూనిట్ ఉపాధ్యక్షుడు రతన్ దూబే ఎన్నికల ప్రచారానికి వెళ్లి హత్యకు గురయ్యారు. అదే ఏడాది అక్టోబర్లో సర్ఖేడా గ్రామంలో బిర్జు తారామ్ అనే బీజేపీ కార్యకర్తను కాల్చి చంపారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో బస్తర్ డివిజన్లో ముగ్గురు బీజేపీ నేతలను మావోయిస్టులు నరికి చంపారు.
Next Story