Fri Dec 20 2024 14:14:04 GMT+0000 (Coordinated Universal Time)
చికెన్ పకోడిలో కారం ఎక్కువైందన్న కస్టమర్.. కత్తితో ఓనర్ దాడి
దాంతో కోపోద్రిక్తుడైన జీవన్.. తింటే తినండి లేదండి పోండి అంటూ దూషించాడు. ఈ క్రమంలో నాగార్జున - జీవన్ ల మధ్య గొడవ..
చికెన్ పకోడిలో కాస్త కారం ఎక్కువైందని కంప్లైంట్ చేసిన కస్టమర్ పై యజమాని కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో మరో వ్యక్తికి గాయాలై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని 9వ ఫేజులో ఉన్న జెఎస్ చికెన్ పకోడి సెంటర్ వద్దకు నాగార్జున అనే వ్యక్తి చికెన్ పకోడి తినేందుకు వెళ్లాడు. పకోడీ తింటుండగా.. కారం కాస్త ఎక్కువైందంటూ షాప్ నిర్వాహకుడైన జీవన్ కు తెలిపాడు.
దాంతో కోపోద్రిక్తుడైన జీవన్.. తింటే తినండి లేదండి పోండి అంటూ దూషించాడు. ఈ క్రమంలో నాగార్జున - జీవన్ ల మధ్య గొడవ పెద్దదైంది. నాగార్జునను తీవ్రంగా దూషిస్తూనే.. కత్తితో దాడి చేయబోయాడు. అడ్డుగా వెళ్లిన ప్రణీత్ రెడ్డికి కత్తిపోటు గాయాలయ్యాయి. చెయ్యి, చెవిపై అతడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని జీవన్ ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story