Sun Mar 30 2025 11:25:25 GMT+0000 (Coordinated Universal Time)
పాస్టర్ ప్రవీణ్ మృతిపై చంద్రబాబు ఆరా
తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.

తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫోన్ చేసి పాస్టర్ ప్రవీణ్ మృతి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చాగల్లులోని ఒక సభలకు రాజమండ్రి నుంచి బైక్ పై వస్తుండగా ఈ ఘటన జరిగిందని డీజీపీ చంద్రబాబు నాయుడుకు తెలిపారు.
అన్ని కోణాల్లో విచారించి...
దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. కాగా పాస్టర్ మృతిపై క్రైస్తవ సంఘాలు రాజమండ్రిలో ఆందోళనకు దిగాయి. పెద్దయెత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పాస్టర్ ప్రవీణ్ ను కొందరు కావాలనే హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోపోస్టుమార్టం నిర్వహించే ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story