Mon Dec 23 2024 18:11:53 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారి కిడ్నాప్.. గంటల వ్యవధిలో కేసును చేధించిన పోలీసులు
అనంతరం అతని తండ్రికి ఫోన్ చేసి.. కోటి రూపాయలు డిమాండ్ చేశారు. వెంటనే బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో
ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రాజీవ్ సాయి అనే చిన్నారి కిడ్నాప్ అయ్యాడంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. రాజీవ్ సాయి తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. దసరా పండుగ నిమిత్తం కుటుంబంతో సొంత ఊరికి వచ్చాడు. 13వ వార్డులోని ఓ ఆలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజ చేస్తున్న సమయంలో దుండగులు 8 ఏళ్ల రాజీవ్ ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.
అనంతరం అతని తండ్రికి ఫోన్ చేసి.. కోటి రూపాయలు డిమాండ్ చేశారు. వెంటనే బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని దుండగులు కారులో వదిలివెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాలుడిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. కాగా.. బాలుడిని కిడ్నాప్ చేసింది ఎవరు ? అన్న విషయం తెలియాల్సి ఉంది.
Next Story