Mon Dec 23 2024 19:29:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కరాటే కల్యాణి ఇంటిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దాడులు
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగల్ రావ్ నగర్ లో ఉన్న కల్యాణి ఇంటిపై అధికారులు దాడులు..
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి ఇంటిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు చేశారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగల్ రావ్ నగర్ లో ఉన్న కల్యాణి ఇంటిపై అధికారులు దాడులు చేశారు. కరాటే కల్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు.. 2 నెల పిల్లల్ని కొనుగోలు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. ఆమె నివాసంపై దాడులు చేసినట్లు సమాచారం. నెలల వయసున్న పిల్లలను అడ్డుపెట్టుకిని డబ్బులు వసూలు చేస్తున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు. కల్యాణి ఇంటిలో సోదాలు నిర్వహించి, ఆమెను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. మూడ్రోజుల క్రితం కరాటే కల్యాణి యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది. ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలతో వల్గర్ గా మాట్లాడుతూ.. వారిలో కామకోరికలు రేపి, తమ కామవాంఛ తీర్చుకుంటున్నాడని ఆరోపించింది. శ్రీకాంత్ రెడ్డిని నడిరోడ్డుపై కొట్టడంతో.. అతను కూడా కల్యాణిపై తిరగబడ్డాడు. ఆమెను చెంపపై కొట్టడంతో విషయం కాస్తా సీరియస్ అయింది. పరస్పర దాడుల అనంతరం ఇద్దరూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి ఇంటిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు శ్రీకాంత్ రెడ్డి కూడా పలు యూ ట్యూబ్ ఛానళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కరాటే కల్యాణి గురించిన నిజాలు అందరికీ తెలీవంటూ.. ఆమె కబ్జాలు చేస్తుందని చెప్తున్నాడు. ఒక వృద్ధాశ్రమాన్ని అడ్డుపెట్టుకుని, దానికి వచ్చిన ఫండ్స్ ను దారి మళ్లిస్తుందని ఆరోపించాడు. తన ప్రాంక్ వీడియోల గురించి మాట్లాడే ముందు.. కల్యాణి ఎన్ని సినిమాల్లో అశ్లీలంగా, బూతు కంటెంట్లో నటించిందో చూసుకోవాలని చెప్తున్నాడు.
Next Story