Wed Jan 15 2025 08:01:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్పత్రిలో శిశువుల మరణ మృదంగం.. వారంలో 9మంది మృతి
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఏకంగా 14 మంది పసిబిడ్డలు మృతి చెందారు. వారంరోజుల వ్యవధిలో 9 మంది మృత్యువాత పడ్డారు.
తిరుపతి : ప్రసూతి ఆస్పత్రిలో శిశువుల మరణమృదంగం మోగుతోంది. కన్నబిడ్డలను తనివితీరా చూసుకోకుండానే మృత్యుఒడికి చేరుతుండటంతో కడుపుకోతతో అల్లాడుతున్నారు. వరుస శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారంరోజుల్లోనే 9 మంది శిశువులు మృతి చెందడంతో.. ప్రసూతి ఆస్పత్రికి రావాలంటేనే భయపడిపోతున్నారు.
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఏకంగా 14 మంది పసిబిడ్డలు మృతి చెందారు. వారంరోజుల వ్యవధిలో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబ సంక్షేమ శాఖ ఆస్పత్రిపై సీరియస్ అయింది. ప్రస్తుతం శిశు మరణాలపై విచారణ జరుపుతోంది. మరోవైపు రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలోనూ శిశు మరణాలు కొనసాగుతుండటంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పసికందుల మరణాలతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంటోంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే శిశు మరణాలు కొనసాగుతున్నాయని ఆందోళనలకు దిగారు భాదితులు. ఈ ఘటనపై కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ విచారణ చేయనున్నారు.
Next Story