Mon Dec 23 2024 05:21:21 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం మత్తులో నాటు బాంబును కొరికేశాడు
మద్యం మత్తులో కొందరు చేసే పనులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ
మద్యం మత్తులో కొందరు చేసే పనులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు ప్రాణాలే పోగొట్టుకునేలా చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో బాంబు కొరికి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అది కూడా భార్యతో గొడవ పడి.. పీకలదాకా తాగి.. మత్తులో సదరు వ్యక్తి ఈ పని చేశాడు.
బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన చిరంజీవి అనే వ్యక్తికి భార్యతో గొడవలు వున్నాయి. ఆమె అతనితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పీకలదాకా మద్యం తాగి నాటు బాంబును చిరంజీవి నోటితో కొరికాడు. అది పేలడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడికి నాటు బాంబు ఎక్కడిది అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. సి ఐ నాగరాజరావు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని స్థానిక బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు
Next Story