Sun Dec 22 2024 22:36:10 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్
కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ను రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం మంజూరు చేసింది.
కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ను రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకోవడానికి తాను వెళ్లాల్సి ఉన్నందున తనకు బెయిల్ ఇప్పించాలంటూ జానీ మాస్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఐదు రోజులు...
మహిళ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదయింది. ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అయితే జాతీయ చలన చిత్ర అవార్డును తీసుకునేందుకు వెళ్లాలన్న కారణంగా బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఐదు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Next Story