Mon Dec 23 2024 07:56:36 GMT+0000 (Coordinated Universal Time)
సీఐ స్వర్ణలతకు బెయిల్
నేవీ మాజీ అధికారులు శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని భావించారు. సూరిబాబు అనే వ్యక్తి
విశాఖపట్నం నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన ఏఆర్ సీఐ స్వర్ణలతకి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో కీలక నిందితురాలు సీఐ స్వర్ణలత సహా మొత్తం నలుగురికి విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు జామీనుతో పాటు పూచీకత్తు సమర్పించాలని నిందితులను కోర్టు ఆదేశించింది. ఇక సీఐ స్వర్ణ లత వ్యవహారం బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చ సాగింది. ఆమె నటిగా కూడా కెరీర్ ను మొదలుపెట్టాలని అనుకోవడం, ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే..!
ఎలా దొరికిపోయిందంటే?
నేవీ మాజీ అధికారులు శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని భావించారు. సూరిబాబు అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశాడు. రూ.90 లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ చేసే రూ.2000 నోట్లు ఇస్తామని చెప్పాడు. నోట్ల మార్పిడిలో ఇబ్బందులు రాకుండా ఉండాలని ఏఆర్ సీఐ స్వర్ణలత వద్ద హోంగార్డులను ఆశ్రయించారు. హోంగార్డులు శ్యామ్ సుందర్, శ్రీనును ఆశ్రయించాక.. నోట్ల మార్పిడి కేసులో బాధితులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.12 లక్షలు డబ్బులు లాక్కున్నారు. తాము మోసపోయామని భావించిన మాజీ నేవీ అధికారులు విశాఖ సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వర్ణలతతో పాటు మరో ముగ్గురు పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Next Story