Mon Dec 23 2024 05:45:03 GMT+0000 (Coordinated Universal Time)
Tirupathi : బదిర విద్యార్థిపై దాడి... పరిస్థితి విషమం
తిరుపతిలో బదిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది
తిరుపతిలో బదిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన చెవిటి, మూగ పాఠశాలలో ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులు కెమికల్ ఆయిల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ విద్యార్థికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చందు అనే విద్యార్థికి, తోటి విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ ఈ ఘటనకు దారితీసింది.
విద్యార్థుల మధ్య...
చందుపై తోటి విద్యార్థులు కెమికల్ ఆయిల్ పోసి నిప్పటించారు. దీంతో చందు శరీరం 80 శాతం కాలిపోయింది. మెజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం తీసుకున్నారు. తన చేయిపై రాసి తనపై దాడి చేసిన వారి పేర్లను ఆ విద్యార్థి చెప్పాడు. విద్యార్థి చందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారకులైన వారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితుడి తరుపున కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Next Story