Sun Dec 22 2024 21:14:44 GMT+0000 (Coordinated Universal Time)
బీజాపూర్ లో ఎన్ కౌంటర్ .. నలుగురు మావోల మృతి
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు
ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఈరోజు ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. వరసగా ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతుండటంతో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.
భద్రతాబలగాలు...
ఈ ఎన్కౌంటర్ లో కొందరు మావోయిస్టులు గాయపడ్డారు. మావోయిస్టులు అక్కడ ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు అటవీ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. అయితే కొందరు మావోయిస్టులు తారసపడటంతో వారిని లొంగిపొమ్మని హెచ్చరించినా వాళ్లు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి మందుపాత, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.
Next Story