Mon Dec 23 2024 02:55:18 GMT+0000 (Coordinated Universal Time)
హాస్టల్ టాయిలెట్ లో విద్యార్థిని మృతి.. కారణమిదే !
తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన వైతీశ్వర్ అనే 17 ఏళ్ల బాలిక తన అత్త చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు..
హాస్టల్ టాయిలెట్ లో ఇంటర్ విద్యార్థిని విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తూత్తుకుడిలోని హాస్టల్ లో గల టాయిలెట్ లో మంగళవారం రాత్రి 12వ తరగతి విద్యార్థిని వైతీశ్వర్ అనుమానాస్పద రీతిలో మృతురాలై కనిపించింది. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్ లో బాలిక తన చావుకు గల వ్యక్తిగత కారణాలను రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేమని, కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు.
తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన వైతీశ్వర్ అనే 17 ఏళ్ల బాలిక తన అత్త చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తన స్కూల్లోని మరో విద్యార్థినితో నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి అని చెప్పిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఇటీవల విద్యాసంస్థల్లో జరిగిన మరణాలపై విచారణ జరపాలని రాష్ట్ర దర్యాప్తు సంస్థ సీబీసీఐడీని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసును సీబీసీఐడీ విభాగానికి బదిలీ చేయనున్నారు. బాలిక చనిపోవడానికి తన అత్త మరణం తట్టుకోలేకపోవడమే కారణమా ? ఇతర కారణాలేవైనా ఉన్నాయా ? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story