Thu Dec 19 2024 13:55:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేక్ ఇన్ స్పెక్టర్ పై వ్యాపారి దాడి.. తెగిపడిన వేలు
కాకినాడలో ఓ వ్యక్తి వ్యాన్ లో కొబ్బరిబోండాలను తీసుకొచ్చి అమ్ముతున్నాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన బ్రేక్ ఇన్ స్పెక్టర్..
ఇటీవల కాలంలో చిన్న చిన్న వివాదాలే పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఎదుటివారి ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడట్లేదు. అసలు విషయానికొస్తే.. రోడ్డుపై వ్యాపారస్తులకు, ట్రాఫిక్ పోలీసులకు అప్పుడపుడూ గొడవలు జరగడం సహజం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారంటూ.. ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో గొడవలు జరుగుతాయి. అలా కాకినాడలో ఓ కొబ్బరి బోండాల వ్యాపారికి - బ్రేక్ ఇన్ స్పెక్టర్ కి మధ్యన గొడవ జరిగింది. ఈ ఘటనలో బ్రేక్ ఇనస్పెక్టర్పై కొబ్బరిబోండా కత్తితో దాడి చేశాడు వ్యాపారి. దీంతో బ్రేక్ ఇన్స్ పెక్టర్ వేలు కూడా తెగిపోయింది.
కాకినాడలో ఓ వ్యక్తి వ్యాన్ లో కొబ్బరిబోండాలను తీసుకొచ్చి అమ్ముతున్నాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన బ్రేక్ ఇన్ స్పెక్టర్ వ్యాన్ కి లైసెన్స్ ఉందా అని అడిగాడు. కొద్ది సేపు కొబ్బరిబోండాలు అమ్ముకొని వెళ్తాను.. పరిమిషన్ ఇవ్వండి అని ఆ వ్యాపారి అడిగాడు. తాను వెహికిల్ లైసెన్స్ అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వ్యాపారిపై బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి బోండాలను నరికే కత్తితో దాడి చేశాడు. దాంతో బ్రేక్ ఇన్ స్పెక్టర్ చేతివేలు తెగిపడింది. స్థానికుల సహాయంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బ్రేక్ ఇన్స్పెక్టర్ పరిస్థితి బాగానే ఉందని.. వేలు తెగిన చోట చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.
Next Story