Mon Dec 23 2024 11:57:50 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమోన్మాది రాక్షసత్వం.. యువతిని రైలుకిందకు తోసి హత్య
యువతి తనకు ఇష్టం లేదని, ప్రేమించడం లేదని చెప్పింది. కోపంతో రగిలిపోయిన సతీశ్.. తనకు దక్కని ప్రేమ..
తనను ప్రేమించలేదని కోపంతో ఊగిపోయిన ఓ ప్రేమోన్మాది.. యువతిని రైలు కిందకు తోసేసి హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నై గిండి సమీప ఆదంబాక్కానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని 20 ఏళ్ల కుమార్తె టీనగర్ లో ఉన్న ప్రైవేటు కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. స్థానికుడైన సతీశ్ (23) ఇటీవల యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.
కానీ.. యువతి తనకు ఇష్టం లేదని, ప్రేమించడం లేదని చెప్పింది. కోపంతో రగిలిపోయిన సతీశ్.. తనకు దక్కని ప్రేమ ఎవరికీ దక్కకూడదని భావించాడు. యువతిని హతమార్చాలని ప్లాన్ చేశాడు. గురువారం కాలేజీకి వెళ్లేందుకు సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారమ్ పై నిల్చుని రైలు కోసం ఎదురుచూస్తోంది. అక్కడికి చేరుకున్న సతీశ్..తనను ప్రేమించాలని యువతితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో తాంబరం నుంచి రైలు వస్తుండగా.. ఆమెను రైలు కిందకు తోసేశాడు.
తీవ్రగాయాలపాలైన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు సతీశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. సతీశ్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి.. అతని కోసం గాలిస్తున్నారు.
Next Story