Tue Dec 24 2024 01:47:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆటో - ప్రైవేటు బస్సు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో - ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో..
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65 ప్రతినిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రహదారి తరచూ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ దారిలో ఏదొక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో - ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో.. ఆటోలో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు.
ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవే పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొర్లపహాడ్ కు సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని ప్రేమ్ కుమార్ గా గుర్తించారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ తో ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story