Sun Dec 22 2024 06:11:53 GMT+0000 (Coordinated Universal Time)
Murder : ఇంట్లో నిద్రిస్తుండగా కాంగ్రెస్ నేత హత్య
దంతెవాడ జిల్లాలోని కాంగ్రెస్ నేత జోగా పొడియం ను మావోయిస్టులు అర్ధరాత్రి కిరాతకంగా హత్య చేశారు
ఛత్తీస్గడ్ లో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దంతెవాడ జిల్లాలోని కాంగ్రెస్ నేత జోగా పొడియం ను మావోయిస్టులు అర్ధరాత్రి కిరాతకంగా హత్య చేశారు. ఆయన ఇంట్లో ఉండగానే వచ్చిన మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసులకు సమాచారం ఇస్తున్నారన్న అనుమానంతో ఆయనను చంపినట్లు తెలిసింది. ఈ ఘటన పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ సమీపంలోనే జరిగింది.
పోలింగ్ జరిగిందని...
ఇంట్లో నిద్రపోతున్న జోగాను కత్తితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పదేళ్ల క్రితం జోగా కుమారుడు కూడా మావోయిస్టుల చేతిలో హతమయ్యాడు. పోతలిలో ఓటింగ్ జరగడానికి జోగా కారణమని భావిస్తూ అతనిని మావోయిస్టులు హత్య చేసినట్లు తెలిసింది. తాము పోలింగ్ ను బహిష్కరించాలని పిలుపు నిచ్చినా జోగా గ్రామస్థులను పోలింగ్ కు వెళ్లేలా చేశాడని కూడా మావోలు భావించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్ేనారు.
Next Story