Mon Dec 23 2024 05:31:15 GMT+0000 (Coordinated Universal Time)
జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య
తెలంగాణలోని జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్య జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు
తెలంగాణలోని జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్య జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. రాజకీయ కక్షలే ఈ హత్యకు గల కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. తన సోదరుడు లాంటి వాడిని కోల్పోయానంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. జగిత్యాల - ధర్మపురి జాతీయ రహదారిపై ఆయన తన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలసి బైఠాయించి నిరసన తెలియ చేశారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పథకం ప్రకారమే...
గంగారెడ్డిని ఒక పథకం ప్రకారమే హత్య చేసినట్లుపోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తమ నేత హత్యకు గురి కావడం పార్టీ పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవా? అంటూ ఆయన ప్రశ్నించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యం నడుస్తుందా? కాంగ్రెస్ పాలన సాగుతుందా? అని జీవన్ రెడ్డి నిలదీశారు.
Next Story