Thu Dec 19 2024 14:54:56 GMT+0000 (Coordinated Universal Time)
విద్యుత్ షాక్ తగిలి దంపతులు మృతి
అయినా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఓ భార్యాభర్తలు అడవి పందుల నుండి తమ చెరుకు తోటను కాపాడుకునేందుకు..
విద్యుత్ షాక్ తగిలి దంపతులు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతంలోని జహీరాబాద్ లో పంట పొలాల్లోకి అడవి పందులు చేరి నానా హంగామా సృష్టిస్తున్నాయి. పచ్చని పంట పొలాల్లోకి వచ్చి అడవి పందులు చేస్తున్న హంగామాకి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటూ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయినా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఓ భార్యాభర్తలు అడవి పందుల నుండి తమ చెరుకు తోటను కాపాడుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు లాగే బుధవారం కూడా భార్య భర్తలిద్దరూ కలిసి తోటకు వెళ్లారు. తోటకు గడ్డి మందు పిచికారి చేస్తుండగా భార్య విద్యుత్ కంచెకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురైంది. అది గమనించిన భర్త తన భార్యను కాపాడే ప్రయత్నం చేయగా.. అతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. ఇలా దంపతులిద్దరూ విద్యుత్ షాక్ కు గురై పొలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Next Story