Mon Mar 24 2025 11:13:39 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
తెలంగాణలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సదరు ప్రేమికులు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వీడియోలో తమ ఆత్మహత్యకు గల కారణాన్ని వివరించారు. పాలకుర్తి మండలం బిక్యానాయక్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
బిక్యానాయక్ తండాకు చెందిన గుగులోత్ రాజు (20), బానోతు దీపిక (16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు, పెద్దలు అంగీకరించరని భావించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలిసి బతకలేకపోయాము.. కనీసం చావులో అయినా ఇద్దరూ కలిసే అని అనుకున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్య ముందు ఇద్దరూ కలిసి సెల్ఫీ వీడియో తీసి, తాము చనిపోతున్నట్లు తెలిపారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Next Story