Mon Dec 23 2024 17:22:06 GMT+0000 (Coordinated Universal Time)
క్యాన్సర్ భయం.. మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య
కొత్త కారాయగూడేనికి చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35)దంపతులకు అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర..
క్యాన్సర్ నిర్థారణ అయినవారు భయపడాల్సిన పనిలేదని, ఇప్పుడున్న వైద్యంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు కూడా నయమవుతున్నాయని వైద్యులు ఎంత అవగాహన కల్పించినా.. అది ఎంతకు దారితీస్తుందోనన్న భయంతో.. కొందరు అర్థాతరంగా జీవితాలను ముగిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో తీవ్ర అనారోగ్యంతో మనస్తాపం చెందిన దంపతులు..కుమార్తె సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కొత్తకారాయగూడేనికి చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35)దంపతులకు అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణాజిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో నమూనాలను సేకరించి టెస్టులకు పంపగా.. గురువారం ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయింది. వెంటనే తిరువూరు వైద్యుల్ని సంప్రదించగా.. కీమో థెరపీకి హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ముగ్గురూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. క్యాన్సర్ అంటే ప్రాణాంతకమైన వ్యాధేనని కుంగిపోయారు.
తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో మూడు స్టూళ్లు, తాడుని కొనుగోలు చేశారు. అనంతరం కొత్తకారాయి గూడెంలోని మామిడితోటకు వెళ్లి, గురువారం రాత్రి మామిడిచెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా.. మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.
Next Story